బాలీవుడ్ శృంగార తార సన్నీలియోన్ ప్రస్తుతం అమెరికా లాస్ ఏంజెల్స్ లో చిక్కుకుంది. ఓ వైపు సినిమాలు.. స్టార్ స్టక్ బ్యూటీ బిజినెస్ లతో బిజీగా ఉండే సన్నీలియోన్ తన పర్సనల్ విషయాలను సోషల్ మీడియాలో ఎప్పటిప్పుడు షేర్ చేస్తూనే ఉంటుంది. ముంబైలో నివాసముండే సన్నీ 2011లో మ్యూజిషియన్ డానియల్ ను పెళ్లి చేసుకుని ముగ్గురు పిల్లల తల్లిగా తన బాధ్యతలను మోయడమే కాదు స్టేట్స్ లో ఉండిపోయిన ఆమె అత్తగారి సంరక్షణార్థం అక్కడికెళ్లిందట. అత్తగారు పెద్ద వయస్కురాలు కావడంతో కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో ఆమెకి తోడుగా ఉండేందుకు వెళ్లినట్టు జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది. పరిస్థితులు చక్కబడ్డాక, ఇంటర్ నేషనల్ ఫ్లైట్స్ రాకపోకలు మొదలైతేగాని ముంబై వచ్చేందుకు వీలుపడదు కనుక అప్పటి వరకూ అక్కడే వేచి ఉంటానంటోంది ఈ బాలీవుడ్ భామ.
- June 5, 2020
- సినిమా
- HOLLYWOOD
- SUNNYLEONE
- డానియల్
- సన్నీలియోన్
- Comments Off on ఫ్లైట్స్ వస్తేనే వస్తా..