యువతిపై కేసునమోదు
సారథి న్యూస్, రామడుగు: ప్రియుడి స్నేహితురాలి పేరుతో నకిలీ పేస్ బుక్ అకౌంట్ సృష్టించిన ఓ యువతిపై రామడుగు పోలీసులు బుధవారం కేసు నమోదుచేశారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన సదరు యువతి స్థానికంగా ఓ షాపులో పనిచేస్తోంది. అదే దుకాణంలో పనిచేస్తున్న సదరు వ్యక్తితో సన్నిహితంగా ఉంటుంది. ఆ వ్యక్తి మరో మహిళతో సన్నిహితంగా ఉండడాన్ని జీర్ణించుకోలేని యువతి.. ప్రియుడి ద్వారా ఆ మహిళ ఫోన్ నంబర్ తీసుకుని నకిలీ పేస్ బుక్ అకౌంట్ సృష్టించి అసభ్యకర పోస్టింగ్ చేసింది. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ తో విసుకుచెంది తీవ్ర ఇబ్బందులకు గురైన సదరు మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు నకిలీ అకౌంట్ గుట్టువిప్పి కేసునమోదు చేశారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టింగ్ లు పెడితే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.