న్యూఢిల్లీ : పోర్చుగల్ ఫుట్‌బాల్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో తన సంపాదనతో బిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరాడు. బిలియనీర్ అయిన వరల్డ్‌లోనే చరిత్ర సృష్టించాడు. టీమ్ స్పోర్ట్స్‌లో ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గాను నిలిచాడు. ఓవరాల్‌గా ప్లేయర్‌గా ఉన్నప్పుడే బిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరిన మూడో ఆటగాడిగా నిలిచాడు. రొనాల్డో కంటే ముందు గోల్ఫ్ గ్రేట్ టైగర్ వుడ్స్, బాక్సర్ మేవెదర్ ఈ ఫీట్ సాధించారు. రొనాల్డో గతేడాది 105 మిలియన్ డాలర్లు(టాక్స్‌లు, ఇతర చార్జీలు కట్టకముందు) డబ్బు సంపాదించాడు. ఇండియన్ కరెన్సీలో ఇది రూ.793కోట్లకు పైగా ఉంటుంది. దీంతో 2020కి గాను ఫోర్బ్స్ ఇటీవల ప్రకటించిన టాప్ వంద సెలబ్రెటీస్ లిస్ట్‌లో నాలుగో స్థానంలో నిలిచాడు. బార్సిలోనాకు చెందిన లియోమెస్సీ ఈ లిస్టులో ఐదవ స్థానంలో నిలిచాడు. ఫోర్బ్స్ వెల్లడించిన వివరాల ప్రకారం రొనాల్డో తన 17 ఏళ్ల కెరీర్‌లో మ్యాచ్ ఫీజుల కింద రూ.4909 కోట్లు(650 మిలియన్ డాలర్లు) పైగా మొత్తాన్ని సంపాదించాడు. 2022, జూన్‌లో తన కాంట్రాక్టు ముగిసే సమయానికి ఈ మొత్తం రూ. 5778 కోట్లు(765 మిలియన్ డాలర్లు)కు చేరుతుందని అంచనా.
- June 6, 2020
- Top News
- క్రీడలు
- FOOTBALL
- RONALD
- పోర్చుగల్ స్టార్
- ఫోర్బ్స్
- లియోమెస్సీ
- Comments Off on ఫుట్‌బాల్ బిలియనీర్ రొనాల్డో