న్యూఢిల్లీ : టీమిండియాలో మిగిలిన వాళ్లతో పొలిస్తే ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా స్టయిలే వేరు. ఆటలోనే కాకుండా తన మేకోవర్ విషయంలోనూ అంతా ప్రత్యేకమే. లుక్స్ పరంగా ఓ కరీబియన్‌ను తలపిస్తాడు. పెద్దపెద్ద వాచ్‌లు, చెయిన్లు, రంగురంగుల దుస్తులతో చాలా డిఫెరెంట్‌గా కనిపిస్తుంటాడు. తన కాబోయే భార్య నటాషాను ఫస్ట్ టైమ్ కలిసినప్పుడు కూడా హార్దిక్ డిఫరెంట్ లుక్‌లోనే ఉన్నాడట. హార్దిక్‌ను చూసి.. వీడెవడో తేడా మనిషిలా ఉన్నాడే అని నటాషా అనుకుందట. త్వరలో పెళ్లి చేసుకోనున్న హార్దిక్, నటాషా తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు ఇటీవల ప్రకటించారు.
సెర్బియాకు చెందిన నటాషాను ఫస్ట్ టైమ్ కలిసినప్పటి సంగతిని హార్దిక్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ‘నటాషాకు నేనెవరో అస్సలు తెలియదు. నేను నా మాటలతో తనని పడేశా. అర్ధరాత్రి ఒంటిగంట అప్పుడు నటాషా నన్ను ఫస్ట్ టైమ్ చూసింది. అప్పుడు నేనే మెడలో పెద్దచెయిన్, చేతికి వాచ్, నెత్తి మీద హ్యాట్ పెట్టుకుని ఉన్నా. వీడెవడో తేడా మనిషి అని ఆమె అనుకుంది. ఆ తర్వాత మాటలు మొదలుపెట్టా. దాంతో ఒకరినొకరు తెలుసుకున్నాం. డేటింగ్ మొదలుపెట్టాం. చివరకు లాస్ట్ ఇయర్ డిసెంబర్ 31న మా ఎంగేజ్‌మెంట్ అయ్యింది’ అని హార్దిక్ చెప్పాడు. ఎంగేజ్‌మెంట్‌కు రెండ్రోజులు ముందు వరకు ఈ విషయం తమ ఫ్యామిలీ కూడా తెలియదని హార్దిక్ తెలిపాడు. ముందు కృనాల్‌కు విషయం చెప్పానని, ఆ తర్వాత ఫ్యామిలీ అంతా తనకు సపోర్ట్ చేసిందని హార్దిక్ వెల్లడించాడు.