తొలి చిత్రం ‘ప్రేమమ్’ తోనే మంచి హీరోయిన్గా మార్కులు వేయించుకుంది మడోనా సెబాస్టియన్. తర్వాత ‘కాదలుమ్ కాదందు పోగుమ్’ అంటూ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి పక్కన జోడీ కట్టి కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్లో నాగచైతన్యకు జోడీగా ‘ప్రేమమ్’ రీమేక్‌లో నటించింది. తెలుగులో అంతగా క్లిక్ అవ్వని ఈ బ్యూటీకి తమిళంలో మాత్రం మంచి ఆఫర్లే వరించాయి. తమిళంలో పా పాండి, కవాన్, జుంగా సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఒక తమిళ సినిమా, ఒక కన్నడ సినిమా చేస్తున్న సెబాస్టియన్‌కు మళ్లీ కోలీవుడ్‌లో ఓ బంపరాఫర్ వెతుక్కుంటూ వచ్చిందట.
ఇలయ దళపతి విజయ్ ‘మాస్టర్’ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. విజయ్ నెక్స్ట్ మూవీ క్రియేటివ్ డైరెక్టర్ మురుగదాస్‌తో చేయనున్నాడు. టైటిల్ ఇంకా ఖరారు కాని ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్‌కు స్కోప్ ఉందట. తాజాగా ఒక హీరోయిన్గా ఈ మలయాళ ముద్దుగుమ్మ మడోనాను చిత్ర యూనిట్ ఫైనల్ చేసిందట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రాబోతోందట. దీంతో ప్రేమమ్ పిల్ల లక్కీ చాన్స్ కొట్టేసిందని కోలీవుడ్ వర్గాలు అనుకుంటున్నాయి.