Breaking News

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ ​న్యూస్​

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​న్యూస్​

  • ఉద్యోగులకు 50శాతం జీతం నాలుగు విడతలుగా చెల్లింపు
  • ఉత్తర్వులు జారీచేసిన ఆర్థిక శాఖ

సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా ఉధృతి.. లాక్​డౌన్​ నేపథ్యంలో కోత విధించిన వేతన బకాయిల చెల్లింపుల విధానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పెన్షనర్లకు అక్టోబర్, నవంబర్ లో రెండు విడతలుగా చెల్లించనున్నట్లు స్పష్టం చేసింది. అధికారులు, సిబ్బందికి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లో మూడు విడతలుగా చెల్లించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీచేసింది. పెన్షనర్లకు సంబంధించి వాయిదావేసిన మొత్తాన్ని అక్టోబర్, నవంబర్ వాయిదాల చొప్పున చెల్లిస్తారు. అఖిలభారత సేవా సర్వీసుల అధికారులకు సంబంధించి, గెజిటెడ్, నాన్ గెజిటెడ్, నాలుగవ తరగతి ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్, అవుట్​సోర్సింగ్, హోనోరియం, ఇతర ఉద్యోగులు, ఎన్నికైన ప్రతినిధులకు అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరిలో నాలుగు విడతలుగా నగదు రూపంలో చెల్లించనున్నారు.