సావిత్రి ఫేమ్ నాగ్అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ఓ చిత్రంలో నటించనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని వైజయంతి సంస్థ నిర్మిస్తుంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ దీపికా పదుకొణే నటించనున్నది. ఈ విషయాన్ని స్వయంగా చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ ట్విట్టర్లో తెలియజేశాడు. టాలీవుడ్లో దీపికా తొలిసారి నటిస్తున్నారు. ‘రాజు స్థాయికి సరిపోయే రాణిని తేవాలి కదా, అందుకే చాలా ఆలోచించి దీపికాను ఎంపికచేశాం. ఇక పిచ్చెక్కిద్దాం’ అంటూ నాగ్అశ్విన్ ట్వీట్ చేశారు. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. 2022 సమ్మర్ కి ఈ మూవీ విడుదల చేయాలనేది నిర్మాత ఆలోచన. దాదాపు 500కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ కథపై అనేక ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి.
- July 19, 2020
- Archive
- జాతీయం
- BOLLYWOOD
- DIPIKA
- NAGASHWIN
- NEWMOVIE
- PRABHAS
- నాగ్అశ్విన్
- ప్రభాస్
- Comments Off on ప్రభాస్‌కు జోడిగా దీపికాపదుకొణే