సారథి న్యూస్, ఖమ్మం: ఖమ్మం జిల్లా నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో టీటీడీ సమావేశ మందిరంలో ఆదివారం ఏర్పాటుచేసిన జిల్లా నీటిపారుదల శాఖ సలహా మండలి సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హాజరయ్యారు. సాగర్ఆయకట్టు కింద సాగవుతున్న పంటలు, నీటి పంపిణీ తదితర అంశాలపై చర్చించారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆర్.వీ కర్ణన్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, రాములు నాయక్, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, రైతుబంధు జిల్లా కోఆర్డినేటర్నల్లమల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
- August 9, 2020
- Archive
- ఖమ్మం
- లోకల్ న్యూస్
- IRREGATION
- KHAMMAM
- MINISTER PUVVADA
- SAGAR
- నీటిపారుదలశాఖ
- మంత్రి పువ్వాడ
- సాగర్
- Comments Off on ప్రతి ఎకరాకు నీరందాలి