Breaking News

ప్రజాసంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ప్రజాసంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

సారథి న్యూస్, ఖమ్మం: ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లా తల్లాడ ఎంపీడీవో ఆఫీసులో ఏర్పాటుచేసిన సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య​అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్​రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తూ ప్రజాపక్షపాతిగా నిలుస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ రాయల వెంకటశేషగిరి రావు, ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు, జడ్పీటీసీ దిరిశాల ప్రమీల, ఎంపీడీవో రవీంద్రారెడ్డి, సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారపోగు వెంకటేశ్వరరావు, వైరా వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ దూపాటి భద్రరాజు, తల్లాడ సొసైటీ చైర్మన్ వీర మోహన్​రెడ్డి, ఎంపీటీసీల సంఘం మండలాధ్యక్షుడు ఆదూరి వెంకటేశ్వరరావు, సర్పంచుల సంఘం అధ్యక్షుడు శీలం కోటిరెడ్డి, టీఆర్​ఎస్​ మండల కార్యదర్శి దుర్గి దేవర వెంకట్ లాల్ పాల్గొన్నారు.