సారథిన్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల గ్రామంలో రూ.1.19 కోట్లతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, 10 పడకలవార్డు, సిబ్బంది నివాస సముదాయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ మలోతు కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యే పొదెం వీరయ్య, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి, ఎస్పీ సునీల్ దత్ తదితరులు పాల్గొన్నారు.