Breaking News

ప్రజలకు జాగ్రత్తలు చెప్పండి

ప్రజలకు జాగ్రత్తలు చెప్పండి

సారథి న్యూస్​, నల్లగొండ: కనిపించని శత్రువైన కరోనాపై ఉమ్మడిగా పోరాటం చేద్దామని మంత్రి గుంటకండ్ల జగదీశ్​ రెడ్డి పిలుపునిచ్చారు. అందుకు స్వీయ నియంత్రణ, భౌతిక దూరం పాటించడమే మార్గమన్నారు. గురువారం సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్​లు ఇతర ప్రజాప్రతినిధులు కాన్ఫరెన్స్​లో పాల్గొన్నారు. సూర్యాపేటకు మార్కెట్​కు చేరడం మన దురదృష్టమన్నారు. అయినా భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఈ మహమ్మారి నియంత్రణపై పౌష్టికారం, ఇతర జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రజాప్రతినిధులకు సూచించారు.