Breaking News

ప్రకృతివనం పరిశీలన

ప్రకృతివనం పరిశీలన

సారథి న్యూస్, రామడుగు: కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం గోపాల్​రావుపేట గ్రామంలోని పల్లె ప్రకృతి వనాన్ని సోమవారం గ్రామ పాలకవర్గం పరిశీలించింది. గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, వారి కుటుంబ సభ్యుల తో కలసి సోమవారం పకృతి వనాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కర్ర సత్య ప్రసన్న, ఉపసర్పంచ్ ఎడవెల్లి మధుసూదన్ రెడ్డి, ఎంపీటీసీలు ఎడవెల్లి నరేందర్ రెడ్డి, ఎడవెల్లి కరుణశ్రీ, రామడుగు మండల కో ఆప్షన్ రజబ్ అలీ వార్డు మెంబర్లు, కార్యదర్శి బుర్రా ప్రసాద్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.