సారథి న్యూస్, ఖమ్మం: కరోనా వ్యాధి వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా వైద్యుల ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందికి థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలను మంగళవారం ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో నిర్వహించారు. లాక్ డౌన్ విధి నిర్వహణలో ఉంటున్న పోలీసు సిబ్బందికి ముందస్తు నియంత్రణ చర్యలలో భాగంగా థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ఆదేశాల మేరకు ఖమ్మం రూరల్ ఏసీపీ వెంకట్రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ రామోజీ రమేష్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ ప్రసన్న కుమార్ పర్యవేక్షణలో రెండొందల మందికి మెడికల్ టెస్ట్లు నిర్వహించారు.
- May 26, 2020
- ఖమ్మం
- లోకల్ న్యూస్
- KHAMMAM
- POLICE
- ఖమ్మం
- థర్మల్ స్ర్కీనింగ్
- మెడికల్ టెస్ట్లు
- Comments Off on పోలీసు సిబ్బందికి ‘థర్మల్ స్క్రీనింగ్’