సారథి న్యూస్, పెద్దశంకరంపేట: మేమున్నామని నిరూపించారు. పేద వధువుకు ఆర్థిక సాయం చేసి ఆదుకున్నారు. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రానికి చెందిన సుశీలమ్మ మనవరాలు పెళ్లి ఖర్చుల కోసం సంగారెడ్డి జిల్లా బ్రాహ్మణ సమాజసేవా సంస్థ తరఫున వ్యవస్థాపక అధ్యక్షుడు సురేష్ జ్యోషి సహకారంతో బ్రాహ్మణ సమాజసేవా సంస్థ మండలాధ్యక్షుడు రామచంద్రాచారి రూ.21వేలు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మురళి పంతులు రూ.11వేల ఆర్థిక సహాయాన్ని మంగళవారం అందజేశారు. కార్యక్రమంలో నారాయణఖేడ్ నియోజకవర్గం అధ్యక్షుడు కిషన్‌రావు దేశ్‌పాండే, జిల్లా బ్రాహ్మణ సమాజ సేవా సంస్థ ఉపాధ్యక్షుడు జీవన్‌రావు దేశ్ముఖ్కృష్ణశర్మ, ప్రభాకర్ రావు, సత్యనారాయణ, సంతోష్ శర్మ, అనంతరాజు, రవి కుమార్, రాము, మహేష్ శర్మ, రంగన్న పాల్గొన్నారు.
- December 8, 2020
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- BRAHMANA SEVASAMSTHA
- PEDDASHANKARAM PET
- పెద్దశంకరంపేట
- బ్రాహ్మణ సమాజసేవా సంస్థ
- మెదక్
- Comments Off on పేద వధువుకు ఆర్థిక సాయం