సారథిన్యూస్, హైదరాబాద్ : పేద ప్రజలు అన్ని వసతులతో సొంత ఇంట్లో సంతోషంగా ఉండటమే సీఎం కేసీఆర్ ఉద్దేశ్యమని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. నాంపల్లి నియోజకవర్గంలోని బజ్జు గుట్టలో రూ. 127 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణాలపై శుక్రవారం సమీక్షించారు. ఒక్కో డబుల్ బెడ్రూం ఇంటి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 7.75 లక్షల రూపాయలను ఖర్చు చేస్తున్నదని చెప్పారు. ఈ కార్యక్రమంలో నగరమేయర్ బొంతు రామ్మోహన్, వివిధ శాఖల అధికారుల పాల్గొన్నారు.