Breaking News

పేదలను ఆదుకోవడం భేష్​

పేదలకు ఆదుకోవడం భేష్​
చెక్కు అందజేస్తున్న ఉద్యోగ సంఘం నేత

సారథి న్యూస్​, మహబూబ్​నగర్​: కరోనా సమయంలో  పేదలను ఆదుకునేందుకు వివిధ సంస్థలు, వ్యక్తులు, ఉద్యోగులు ముందుకు రావడం అభినందనీయమని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ కొనియాడారు. ఆదివారం ఆయన మహబూబ్​ నగర్ జిల్లా కేంద్రంలోని సుబ్రమణ్య కాలనీ, పాలకొండతండా ప్రాంతాల్లో సరుకులు పంపిణీ చేశారు. కష్టకాలంలో వలస కూలీలను ఆదుకోవాలనే సంకల్పంతోనే వారికి బియ్యం, కూరగాయలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. పట్టణంలోని మెట్టుగడ్డ వద్ద ఉన్న ఆర్వీఎం భవనం ఎదుట బహుజన తరగతుల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులను మంత్రి అందజేశారు. మార్కండేయ కాలనీ, అశోక్ థియేటర్ వద్ద తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సరుకులు పంపిణీ చేశారు. పద్మశాలి ఉద్యోగులు వి.బాలరాజ్, సత్యనారాయణ రూ.10వేల చెక్కులను మంత్రికి కరోనా సహాయం కోసం అందజేశారు. అనంతరం మంత్రి ఆర్యసమాజ్, బ్రాహ్మణవాడిలో పాలమూరు బ్లడ్ బ్యాంక్ వారు ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. యువత రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. మంత్రి వెంట రాష్ట్ర సంగీత నాటక అకాడమీ అధ్యక్షుడు బాద్మి శివకుమార్ , మున్సిపల్ చైర్మన్ నరసింహులు, జేపీఎన్ ఈసీ చైర్మన్ రవి కుమార్ ఉన్నారు.

కూడళ్లు, రోడ్ల పనులను వేగవంతం చేయండి

పట్టణంలోని కూడళ్లు, రోడ్డు వెడల్పు పనులు శరవేగంగా పూర్తచేయాలని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. ఆదివారం ఆయన మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలో పర్యటించారు. పట్టణంలోని వన్ టౌన్, తెలంగాణ చౌరస్తా వద్ద ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్​ ఫార్మర్లను తొలగించాలని ఆదేశించారు.