సారథి న్యూస్, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం చర్ల ఇటిక్యాల గ్రామ శివారులో పేకాట శిబిరంపై నాగర్ కర్నూల్ సీఐ గాంధీనాయక్ ఆధ్వర్యంలో బుధవారం తాడూరు ఎస్సై నరేందర్, నాగర్ కర్నూల్ ఎస్సై మాధవరెడ్డి దాడులు నిర్వహించారు.
ఎనిమిది మంది అరెస్ట్ కాగా, ఇద్దరు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి రూ.67,800 నగదుతో పాటు పది సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.