డేటింగ్ లు గ్రటా అన్నీ అయిపోయి దాదాపు పెళ్లి చేసుకుంటున్నారు అనుకునే టైమ్ వచ్చేసరికి ఇద్దరూ విడిపోయారు విశాల్ అండ్ వరలక్ష్మీ శరత్ కుమార్ లు.. సాలిడ్ పర్సనాలిటీతో స్టామినాగా ఉండే ఈ తమిళ ముద్దుగుమ్మ తర్వాతేమో ఓ క్రికెటర్ తో డ్యూయెట్లు పాడుతోంది, పెళ్లికూడా చేసుకుంటుందట అని ట్రోలింగ్ మొదలుపెట్టారు. వాటన్నిటికీ చెక్ పెడుతూ వరలక్ష్మి ట్విట్టర్ లో ఇలా ట్వీట్ చేసింది. ‘ఇప్పుడు నా పెళ్లికి ఏమంత తొందర వచ్చింది.. ఒకవేళ చేసుకుంటే మీ అందరికీ చెప్పే చేసుకుంటా. ఇప్పుడొచ్చేవన్నీ రూమర్సే. అవేమీ పట్టించుకోకండి’ అంటూ నవ్వుతూ కొట్టి పారేస్తూ తన గురించి వస్తున్న రూమర్లకు చెక్ పెట్టేసింది. అన్నట్టు వరలక్ష్మి మీకందరికీ తెలుసుగా విశాల్ సినిమా ‘పందెంకోడి 2’, సందీప్ కిషన్ ‘తెనాలి రామకృష్ణ’, ‘ఎల్ఎల్బీ’ సినిమాల్లో విలన్గా నటించిన అమ్మాయి. ప్రస్తుతం కొన్ని తమిళ సినిమాలతో పాటు తెలుగులో రవితేజ సినిమా ‘క్రాక్’లో కీలకపాత్రలో నటిస్తోంది.
- May 19, 2020
- సినిమా
- SHARATHKUMAR
- VARALAKSHMI
- VISHAL
- ఎల్ఎల్బీ
- క్రాక్
- పందెంకోడి 2
- రవితేజ
- Comments Off on పెళ్లి ఇప్పుడే చేసుకోను