– మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్
సారథి న్యూస్, మహబూబ్ నగర్: పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని వీలైనంత తొందరలోనే పూర్తిచేస్తామని మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. రూ.30 కోట్ల వ్యయంతో రూర్బన్ స్కీమ్ ద్వారా మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు మంత్రి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. గండీడ్ మండలంలో స్టేడియం, ఆడిటోరియం, వ్యవసాయ సంబంధిత అభివృద్ధి పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అనంతరం గండీడ్ మండలానికి మంజూరైన అంబులెన్స్ ను ప్రారంభించారు. గిరిజనులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ మోహన్ లాల్, జడ్పీచైర్మన్ స్వర్ణసుధాకర్ రెడ్డి, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
వారి సేవలు మరువలేనివి
కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో అంగన్వాడీ, ఆశా కార్యకర్తల పాత్ర మరువలేనిదని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం మహబూబ్‌నగర్ కలెక్టరేట్ లో కార్యకర్తలకు మాస్క్‌లు, శానిటైజర్లు పంపిణీచేశారు. కరోనా సమయంలో ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు శ్రమించి పనిచేశారని కొనియాడారు. వాక్సిన్ వచ్చే వరకు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ ఎస్.వెంకట్రావు, అడిషనల్ కలెక్టర్ సీతారామరావు, డీఆర్వో కె.స్వర్ణలత, డీఎంహెచ్‌వో డాక్టర్ కృష్ణ, ఆర్డీవో శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ సురేందర్ పాల్గొన్నారు.