యాక్షన్ గ్లామర్‌ను కూడా మస్త్ గుప్పిస్తోంది పాయల్ రాజ్‌పుత్.. ఆరెక్స్ 100, ఆర్డీఎక్స్ లవ్ లాంటి సినిమాలతో కుర్రకారుని మైకంలో ముంచేసింది. గత ఏడాది వెంకటేశ్, నాగచైతన్యల సినిమా ‘వెంకీమామ’లో కూడా మంచి రోల్ పోషించినా ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయేసరికి పాపకి తెలుగులో కొద్దిగా అవకాశాలు తగ్గినమాట వాస్తవమే.
కానీ తమిళంలో ‘ఏంజెల్’ అని సినిమాతో కోలీవుడ్‌కు ఎంటర్ అవడానికి సిద్ధపడుతోంది. ఈలోపు లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ఈ గ్లామర్ డాల్ ఊరికే కూర్చోకుండా ఏదో షార్ట్ ఫిల్మ్ తీసిందట. దాన్ని అన్ని భాషల్లో రిలీజ్ చేస్తుందట. రీలీజ్ చేసేంతవరకూ దాని గురించి ఎలాంటి వివరాలూ చెప్పనంటోంది. మరి అంతగా ఏముందో దానిలో చూశాకా కానీ తెలీదు. అప్పటిదాకా వెయిట్ చేద్దాం మరి..!