వాషింగ్టన్: పాకిస్తాన్‌కు అమెరికా పెద్ద షాక్ ఇచ్చింది. నకిలీ లైసెన్సుల వివాదం నేపథ్యంలో పాకిస్తాన్ విమానయాన సంస్థ (పీఐఏ)పై నిషేధం విధించింది. పీఐఏపై యూరోపియన్ యూనియన్ ఇప్పటికే నిషేధం విధించింది. పాకిస్తాన్ నుంచి అమెరికాకు నడిచే పీఐఏ చార్టర్ ఫ్లైట్స్ అనుమతిని రద్దు చేస్తున్నట్లు యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రకటించింది. పాకిస్థాన్‌లో సగానికి పైగా పైలెట్ లైసెన్సులు నకిలీవని తేలడంతో ప్రంపచవ్యాప్తంగా పలుదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
తాజాగా అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌ఏఏ) కూడా పీఐఏ విమాన సర్వీసులపై ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌లో ఇప్పటి వరకు జారీయైన పైలట్ లైసెన్సుల్లో ఎక్కువ శాతం చెల్లనివని అక్కడి ప్రభుత్వ నివేదిక స్పష్టం చేసింది. దేశంలో 860 లైసెన్సుల్లో దాదాపు 262 సందేహాస్పదంగా ఉన్నాయని తేలింది. దీనిపై పాకిస్థాన్ పార్లమెంట్‌లో కూడా చర్చ జరిపారు.