కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు సోమెన్ మిత్రా (78) గురువారం తుదిశ్వాస విడిచారు. ఆయన కొంతకాలంగా సీవోపీడీ ( క్రానిగ్ అబ్స్క్రక్టివ్ పుల్మోనరీ వ్యాధి)తో బాధపడుతూ కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. కాగా గురువారం తెల్లవారుజామున ఆయన పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయారు. సోమెన్ కరోనాతో మృతిచెందారన్న వార్తల్లో నిజం లేదని ఆసపత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఆయనకు కరోనా పరీక్షలు చేయగా నెగిటివ్ వచ్చిందని తెలిపాయి. సోమెన్ మృతికి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, యువనేత రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ తదితరులు సంతాపం తెలిపారు. టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆయన మృతికి సంతాపం తెలిపారు.
- July 30, 2020
- Archive
- జాతీయం
- BENGAL
- PASSES AWAY
- PCC CHIEF
- పశ్చిమ బెంగాల్
- సోమెన్ మిత్రా
- Comments Off on పశ్చిమబెంగాల్ పీసీసీ చీఫ్ మృతి