Breaking News

పర్యాటక కేంద్రంగా కోయిల్​సాగర్​

పర్యాటక కేంద్రంగా కోయిల్​సాగర్​

సారథి న్యూస్, దేవరకద్ర: ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలోని కోయిల్​సాగర్​ ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. అందుకోసం సీఎం కేసీఆర్ సుముఖత వ్యక్తంచేశారని వెల్లడించారు. కోయిల్ సాగర్ ప్రాజెక్టులో మత్స్య శాఖ ఆధ్వర్యంలో దేవరకద్ర, నారాయణపేట ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్​రెడ్డి, ఎస్.రాజేందర్ రెడ్డితో కలసి శనివారం 7.7లక్షల చేపపిల్లలను విడుదల చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కోయిల్ సాగర్ తో పాటు కోయిలకొండ, రామగిరిగుట్ట, రాంకొండ ప్రాంతాలు పర్యాటక కేంద్రాల జాబితాలో ఉన్నాయని వివరించారు. వీటితో పాటు మహబూబ్ నగర్ లోని పిల్లలమర్రి తదితర ప్రాంతాలను కలిపి టూరిజం సర్క్యూట్ గా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా కోయిల్ సాగర్ కు సాగునీటిని సరఫరా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, రాజేందర్​రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో మత్స్య అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసింన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అన్నపూర్ణ, ఎంపీపీ రమా శ్రీకాంత్ యాదవ్, ఆర్డీవో శ్రీనివాసులు, ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, మత్స్యశాఖ సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నరసింహారెడ్డి, మత్స్యకారులు, రైతులు పాల్గొన్నారు.