భోపాల్: ఇటీవల బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియా ట్విట్టర్ ప్రొఫైల్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఏడాది మార్చిలో బీజేపీలో చేరిన సింధియా తన ట్వీట్టర్ ప్రొఫైల్‌లో బీజేపీ పేరును తొలగించారు. దీంతో ఇప్పుడు ఆయన ప్రొఫైల్‌లో ‘పబ్లిక్ సర్వెంట్, క్రికెట్ ఇష్టం’ అని మాత్రమే ఉంది. అయితే శివరాజ్‌సింగ్ చౌహాన్ టీమ్‌తో ఆయనకు విభేదాలు ఉన్నాయని, అందుకే ఆయన పార్టీ పేరును తొలగించారనే రూమర్స్ వస్తున్నాయి. కాగా ఆ వార్తలను సింధియా ఖండించారు. అయితే బీజేపీతో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని అని చెప్పారు. ఈ విషయంపై ఆ పార్టీ లీడర్ ప్రద్యుమ్నా సింగ్ తొమార్ కూడా స్పందించారు.
ట్విట్టర్ ప్రొఫైల్ మార్పుపై వస్తున్న వార్తలు నిజమైనవి కాదన్నారు. దాదాపు 18ఏళ్లు కాంగ్రెస్ పార్టీతో ఉన్న గుణ మాజీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా ఈ ఏడాది మార్చి 11న బీజేపీలో చేరారు. దీంతో ఆయనకు అనుకూలంగా ఉన్న 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ను వీడి.. మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు మద్దతు పలికారు.