సారథి న్యూస్, హుస్నాబాద్ : సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని స్థానిక అగ్రికల్చర్ ఆఫీసులో ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో మాట్లాడారు. రైతులు మొక్కజొన్న పంటను వానాకాలంలో వేయొద్దని, యాసంగిలో సాగుచేసుకోవాలన్నారు. వరి, పత్తి వాణిజ్య పంటలతోపాటు పప్పు దినుసులైన కంది, పెసర, కూరగాయలు సాగుచేయడం ద్వారా వ్యవసాయం లాభసాటిగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ అయిలేని అనిత, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతిరెడ్డి, తహసీల్దార్ అబ్దుల్ రహమాన్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
- May 27, 2020
- షార్ట్ న్యూస్
- AGRICULTURE
- CM KCR
- VEGITABLES
- కూరగాయల సాగు
- తెలంగాణ
- వ్యవసాయశాఖ
- Comments Off on పప్పులు, కూరగాయల సాగు లాభసాటి