సారథి న్యూస్, మహబూబ్ నగర్ :లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో పలు రంగాల కార్మికులు పనులు చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తున్నట్లు కలెక్టర్ ఎస్.వెంకటరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే వీలుందని, పట్టణాల్లో వీటికి ఎలాంటి మినహాయింపు లేదని స్పష్టం చేశారు. వాటిల్లో ఇటుక బట్టీలు, చేనేత, స్టోన్ క్రషింగ్, బీడీ తయారీ, ఇసుక మైనింగ్, సెరామిక్ టైల్స్, రూఫ్ టైల్స్, సిమెంట్ ఫ్యాక్టరీ, జిన్నింగ్ మిల్స్, ఐరన్, స్టీల్ ఇండస్ట్రీ, ప్లాస్టిక్, సానిటరీ పైపుల నిర్మాణం, కాటన్ పరుపుల తయారీ, పేపర్, రబ్బర్ ఇండస్ట్రీ నిర్మాణ పనులను చేసుకునేందుకు అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు. ప్రతిఒక్కరూ సామాజిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు ధరిస్తూ మాత్రమే చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నట్లు తెలిపారు.