Breaking News

పంటమార్పిడి తప్పనిసరి

పంటమార్పిడి తప్పనిసరి

–కలెక్టర్ వెంకట్రావు

సారథి న్యూస్, మహబూబ్ నగర్ : నూతన వ్యవసాయ విధానం ప్రకారం పంటలు సాగు చేసి అధిక దిగుబడులు పొందాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు రైతులకు సూచించారు. సోమవారం ఆయన మహబూబ్ నగర్ మండలం ఏనుగొండలో వానాకాలం వ్యవసాయ సాగుపై నిర్వహించిన అవగాహన సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తప్పని సరిగా పంట మార్పిడి చేయాలని, మొక్క జొన్న వేయవద్దని కోరారు.

రైతు వేదిక నిర్మాణానికి స్థలం గుర్తించామని, త్వరలోనే నిర్మాణం చేపడతామని వెల్లడించారు. అనంతరం పలువురు రైతులు మాట్లాడుతూ తమ పొలాల్లోకి పందులు వచ్చి పంట పాడు చేస్తున్నాయని, అందువల్ల పందుల బెడదను తొలగించాలని కోరారు. అలాగే రెవెన్యూ రికార్డులు సరిగా లేవని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా రెండు, మూడు రోజుల్లో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి రికార్డులను సరిచేస్తామని కలెక్టర్ హామీనిచ్చారు. రైతులకు పందుల బెడద లేకుండా చూడాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బంధు అధ్యక్షుడు గోపాల్ యాదవ్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, డీసీసీబీ ఉపాధ్యక్ష్యుడు కొరమోని వెంకటయ్య, స్థానిక కౌన్సిలర్ వనజ, వ్యవసాయ శాఖ జేడీ రూఖ్యనాయక్, ఏడీ పాల్గొన్నారు.