Breaking News

‘నో పెళ్లి’ .. వైరల్ అవుతున్న పాట..

'నో పెళ్లి’ .. వైరల్ అవుతున్న పాట..

‘చిత్రలహరి’ సినిమాతో సక్సెస్ ట్రాక్ పై వచ్చిన సాయిధరమ్ తేజ్ ‘ప్రతిరోజూ పండుగే’ సినిమాతో వచ్చి మరో విజయాన్ని సాధించాడు. ఇప్పుడు ‘సోలో బతుకే సో బెటర్’ అంటూ వస్తున్నాడు. తేజ్, నభా నటేష్ హీరో హీరోయిన్లుగా యువ దర్శకుడు ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్ ‘నో పెళ్లి’ అనే ఆటను సోమవారం ఉదయం విడుదల చేశారు. అర్మాన్ మాలిక్ పాడిన ఈ పాటకు రఘురామ్ సాహిత్యం అందించాడు. అయితే ఈ పాటలో హీరో వరుణ్ తేజ్ కనిపించడం ఒక విశేషమైతే, రీసెంట్గా తన ప్రేమ కబురందంచింది..త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న రానా కూడా ఈ పాటలో మెరవడం మరో విశేషం.

ఇక ట్వీట్టర్ ద్వారా హీరో నితిన్ ఈ పాటను విడుదల చేసి సాంగ్ చాలా బాగుందంటూ ప్రశంసలు కురిపిస్తూ.. ‘ఇలా ఇంకెన్ని రోజులు సింగిల్గా ఉంటావో చూస్తాను.. కొన్నిసార్లు పెళ్లి చేసుకోవడంలో టైమ్ గ్యాప్ ఉంటుందేమో కానీ, పెళ్లి చేసుకోవడం పక్కా’అంటూ కమెంట్ కూడా చేశాడు. మొత్తానికి ఈ పాట పెళ్లి కాని కుర్రాళ్లందరికీ కనెక్ట్ అయిపోయి వైరల్ అయిపోతోంది.