Breaking News

నేరాల అదుపునకు సీసీ కెమెరాలే కీలకం

నేరాల అదుపునకు సీసీ కెమెరాలే కీలకం

సారథి న్యూస్, హుస్నాబాద్: గ్రామాల్లో నేరాలను అదుపు చేసేందుకు సీసీ కెమెరాల పాత్ర చాలా కీలకమని ఏసీపీ మహేందర్ అన్నారు. ఈ సందర్భంగా గురువారం కొహెడ మండలం బత్తులవానిపల్లి గ్రామంలో సీసీ కెమెరాలను ప్రారంభించారు. గ్రామ ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా అసాంఘిక కార్యకలాపాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చన్నారు. ఒక్కో సీసీ కెమెరా 24గంటల పాటు నిరంతరాయంగా పనిచేస్తూ గ్రామానికి రక్షణగా నిలుస్తుందన్నారు. ‘నేను సైతం’ కార్యక్రమంలో భాగంగా ఆరు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం సంతోషకరమన్నారు. హుస్నాబాద్ పోలీస్ డివిజన్ పరిధిలోని బెల్ట్​షాపులు, గుట్కాలు, పేకాట వంటి చట్టవ్యతిరేక కార్యకాలపాలు నిర్వహిస్తే డయల్​ 100, సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ వాట్సాప్ 7901100100 నంబర్​కు సమాచారం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ కీర్తి, సీఐ రఘు, ఎస్సై రాజుకుమార్, సర్పంచ్​ లక్ష్మి, ప్రజాప్రతినిధులు, పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.