సారథి న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: నేరస్తులు ఎవరైనా సరే శిక్షపడేలా కృషిచేయాలని భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునీల్దత్పోలీసు అధికారులను ఆదేశించారు. శనివారం తన ఆఫీసులో మణుగూరు సర్కిల్, కొత్తగూడెం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. పెండింగ్కేసుల వివరాలను ఆరాతీశారు. పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారానికి ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా కృషిచేయాలని ఆదేశించారు. న్యాయాధికారులతో సమన్వయం పాటించాలన్నారు. సమావేశంలో మణుగూరు ఏఎస్పీ శబరీష్, ఏసీబీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, డీసీఆర్బీ సీఐ గురుస్వామి, మణుగూరు సీఐ షుకూర్, కొత్తగూడెం వన్ టౌన్ సీఐ రాజు పాల్గొన్నారు.
- September 19, 2020
- Archive
- ఖమ్మం
- లోకల్ న్యూస్
- BADRADRIKOTHAGUDEM
- MANUGURU
- SP SUNILDATH
- ఎస్పీ సునీల్ దత్
- భద్రాద్రి కొత్తగూడెం
- మణుగూరు
- Comments Off on నేరస్తులకు శిక్షపడేలా కృషి