సారథి న్యూస్, పాల్వంచ: మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని ఆదివారం దసరా పండగ పూట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం ఉల్వనూరు గ్రామ మహిళలు రోడ్డెక్కారు. మంచి నీళ్లు ఇప్పించండి మహాప్రభో.. అని ఖాళీబిందెలతో నిరసన తెలిపారు. ‘చుట్టుపక్కల గ్రామాల అన్నింటికీ భగీరథ నీళ్లు వస్తున్నాయి. కానీ తమ ఊరుకు మాత్రం రావడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులకు చెప్పినా పట్టించుకోవడం పట్టించుకోవడం లేదు. కలెక్టర్ గారు! ఎమ్మెల్యే గారు! మీరైనా మా బాధలను అర్థం చేసుకుని పైప్ లైన్ వేయించి, నల్లాలు ఇప్పించండి’ అని ఎండలోనే ఆందోళన చేపట్టారు. కార్యక్రమంలో గ్రామపెద్దలు శ్యాగల బాబు, బర్ల లక్ష్మణ్ రావు, నిట్ట బాబు, తడికల దాసు, దారం రమేష్, మోట జగదీశ్, దీపక్, రమణయ్య, ముత్తయ్య, ప్రసాద్ పాల్గొన్నారు.
- October 25, 2020
- Archive
- ఖమ్మం
- లోకల్ న్యూస్
- KHAMMAM
- KOTHAGUDEM
- MISSION BAGIRATHA
- PALWANCHA
- కొత్తగూడెం
- ఖమ్మం
- పాల్వంచ
- మిషన్ భగీరథ
- Comments Off on నీళ్లు ఇప్పించండి.. మహాప్రభో!