సారథి న్యూస్, మహబూబాబాద్: మంచి నీటిని చౌర్యం చేస్తే కేసులు పెట్టాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లాలోని గార్ల మండలం సీతంపేటలో ప్రత్యేక పారిశుద్ధ్య పనులను ఆయన పరిశీలించారు. గ్రామస్తులు తాగునీటి కష్టాలను కలెక్టర్ దృష్టికి తెచ్చారు. తక్షణమే సర్పంచ్లతో మీటింగ్ పెట్టి ఏర్పాటు చేయాలని గార్ల ఎంపీడీవో ఆదేశించారు. ఇంటింటికి మరుగుదొడ్లు నిర్మించుకోవాలని, ఇంకుడుగుంతలు తవ్వుకోవాలని సూచించారు. డంపింగ్ యార్డును కంప్లీట్ చేయాలని ఆదేశించారు. సమావేశంలో జడ్పీ సీఈవో సన్యాసయ్య, తహసీల్దార్ ఆర్.విజయ్ కుమార్, ఎంపీడీవో రవీందర్ పాల్గొన్నారు.
- June 8, 2020
- లోకల్ న్యూస్
- వరంగల్
- COLLECTOR
- MAHABUBABAD
- కలెక్టర్ వీపీ గౌతమ్
- డంపింగ్ యార్డు
- Comments Off on నీటిచౌర్యం చేస్తే కేసులే