సారథి న్యూస్, రామడుగు: కరోనా వ్యాప్తి.. లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు వెంటనే నిరుద్యోగ భృతి ఇవ్వాలని కరీంనగర్ పార్లమెంటరీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాగి శేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం కరీంనగర్ కలెక్టర్ కె.శశాంకకు వినతిపత్రం అందజేశారు. సీఎం కేసీఆర్ ఎన్నికల్లో హామీ ఇచ్చి అమలుచేయకపోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో 34 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని, ఈ కష్టసమయంలో వారందరికీ రూ.3,016 ఇవ్వాలని కోరారు.
- June 8, 2020
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- KARIMNAGAR
- YOUTH CONGRESS
- నిరుద్యోగ భృతి
- సీఎం కేసీఆర్
- Comments Off on నిరుద్యోగ భృతి ఇవ్వండి