Breaking News

నిరాడంబరంగా హరితహారం

సారథిన్యూస్​, నెట్​వర్క్​: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా అధికారులు, ప్రజాప్రతినిధులు నిరాడంబరంగా ప్రారంభించారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం, చింతకాని మండలాల్లో జెడ్పీ చైర్మన్​ లింగాల కమల్​రాజ్​, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్​ కొండబాల కోటేశ్వర్​రావు మొక్కలు నాటారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బయ్యారం క్రాస్ రోడ్ లో తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మొక్కలు నాటారు. కరీంనగర్ జిల్లాలోని చొప్పదండిలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​, జిల్లా కలెక్టర్​ శశాంక మొక్కలు నాటారు. మెదక్​ జిల్లా నిజాంపేట మండలంలోని తిప్పనగుళ్ల గ్రామంలో చిన్నారులు హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కను నాటి నీళ్లు పోశారు.

సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురంలో సర్పంచ్ పందిరి కళావతి మొక్కలు నాటారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని పోలీస్​ హెడ్​క్వార్టర్స్​లో కమిషనర్​ తఫ్సీర్​ ఇక్బాల్​ మొక్కలు నాటారు. ఆయా కార్యక్రమాల్లో మార్కెట్​ కమిటీ చైర్మన్​ చావ రామకృష్ణ, డీసీసీబీ డైరెక్టర్ ఐలూరు వెంకటేశ్వర్ రెడ్డి, ఎంపీపీ దేవరకొండ శిరీష, జెడ్పీటీసీ శీలం కవిత, సర్పంచ్ మొగిలి అప్పారావు, రైతు బంధు మండల కన్వీనర్ వెంకట్రామిరెడ్డి, రైతు బంధు జిల్లా కమిటీ సభ్యులు వేమిరెడ్డి త్రివేణి, టీఆర్​ఎస్​ నేతలు ఉమా మహేశ్వరి, నారాయణ, ఎంపీటీసీ కిశోర్, ఎంపీటీసీ మల్లికార్జున్​రెడ్డి, ఇంచార్జి ఎంపీడీవో, వెంకటేశ్వర రెడ్డి, తహసీల్దార్​ ముజాహిద్దీన్ తదితరులు పాల్గొన్నారు.