నిత్యావసర సరుకుల పంపిణీ
సారథి న్యూస్, నాగర్కర్నూల్: లాక్ డౌన్ నేపథ్యంలో పేద కుటుంబాలను ఆదుకునేందుకు పెద్దకొత్తపల్లి ఎంపీపీ సూర్యప్రతాప్ గౌడ్, మిత్రమండలి సమకూర్చిన నిత్యావసర సరుకులను మరికల్ గ్రామంలో మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం పంపిణీ చేశారు. అలాగే ముష్టిపల్లి, నక్కలపల్లి, వెన్నచర్ల గ్రామాల్లో సరుకులను పంపిణీ చేశారు. కష్టకాలంలో పేదలను ఆదుకోవడం అభినందనీయమని దాతలను కొనియాడారు. కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.