Breaking News

నా భాష నేర్చుకుంటున్నా..

నా భాష నేర్చుకుంటున్నా..

కరోనా లాక్​ డౌన్​ను చక్కగా వినియోగించుకుంటున్నారు హీరోయిన్లు. నిత్యామీనన్ కథలు రాస్తుంటే, అదితీరావు హైదరి కలరీ స్కిల్స్ ప్రాక్టీస్ చేస్తోంది. సమంతా ఫిట్​ నెస్​ ట్రైనింగ్ అవుతుంటే రకుల్ వంటల వీడియోలు చేస్తోంది. ఇలా తమ అమూల్యమైన సమయాన్ని వృథా కానివ్వకుండా ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారు. నేనేం తక్కువా అంటూ తనేం చేస్తోంది చెప్పుకొచ్చింది తమన్నా భాటియా.

ఇండస్ట్రీకి వచ్చాకా బిజీ అయిపోవడంతో తన మాతృభాష సింధీ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోయిందట. ఇప్పుడీ లాక్​ డౌన్ సమయంలో అమ్మ దగ్గరనుంచి ఆ భాషను పూర్తిగా నేర్చుకుంటోందట. అంతేకాదు సింధీ రుచికరమైన వంటలను కూడా ఎలా చేయాలో తెలుసుకుంటోందట. అంటే మొత్తం మీద కరోనా పుణ్యమా! అని చాలామంది లాగే తమన్నా కూడా తన ఫ్యామిలీతో స్పెండ్ చేయడమే కాదు తన కోరికలను కూడా ఇలా తీర్చుకుంటోందన్నమాట.