నా పాట నచ్చిందా..?
మ్యూజిక్ అంటే లాంగ్వేజ్ ఆఫ్ ద హార్ట్ అంటోంది రాశీఖన్నా. లాస్ట్ ఇయర్ ప్రతిరోజూ పండగే, వెంకీ మామ సినిమాలతో హిట్ అందుకుంది. ఈ సంవత్సరం రౌడీ విజయ్ దేవరకొండతో చేసిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ మాత్రం రాశీకి నిరాషే మిగిల్చింది. ప్రస్తుతం టాలీవుడ్లో ఆఫర్లు ఏమీ లేవు. లాక్ డౌన్ కారణంగా కూడా ఇంటికే పరిమితమైంది రాశి. కానీ ఇప్పుడు మాత్రం తనలో దాగి ఉన్న మల్టీటాలెంట్ ను బయటికి తీస్తోంది. ఆల్ రెడీ సింగర్ అయిన రాశి సినిమాల్లో కూడా పాడింది. ఇప్పుడు గిటార్ ప్లేయింగ్ నేర్చుకుంటోంది. తను ప్రాక్టీస్ చేసిన తనకెంతో ఇష్టమైన ఓ పాట ‘గెట్ యు ది మూన్’ అంటూ ఓ చక్కని ఇంగ్లిష్ గీతాన్ని ఆలపిస్తూ ‘మ్యూజిక్ లాంగ్వేజ్ ఆఫ్ ద ఆర్ట్’ ట్వీట్ చేస్తూ ట్విట్టర్ లో వీడియో పోస్ట్ చేసింది. ఆమె గాత్రానికి అభిమానులంతా ముగ్ధులైపోతూ ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. టైమ్ ను వేస్ట్ చేసుకోకుండా ఇలా తన టాలెంట్ కు మెరుగులు దిద్దడంతో రాశిని అందరూ అప్రిషియేట్ కూడా చేస్తున్నారు.