ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్ లో ‘వి’ విడుదలకు రెడీ కాగా, వరుస సినిమాలతో సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు నాని. శివ నిర్వాణతో ‘టక్ జగదీష్’, ట్యాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలో నటించనున్నాడు నాని. వీటితో పాటు వివేక్ ఆత్రేయతోనూ ఒక మూవీ కమిట్ అయ్యాడు. ఇంతలో ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటికొచ్చింది. సితార ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ జూలై నుంచి ప్రారంభం కానుందట.
కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో సాగనున్న ఈ సినిమా కోసం కోల్ కతా సెట్ సిద్ధం చేస్తున్నారట చిత్రయూనిట్. పీరియాడిక్ మూవీగా తెరకెక్కనున్న సినిమా కోసం హైదరాబాద్ లోనే పాతకాలం కోల్‌కతా చూపించే విధంగా సెట్‌ను తీర్చిదిద్దుతున్నారట. మూడు గెటప్ లతో నాని కనిపించనున్నాడని..అందులో కోల్‌కతాలో బెంగాలీ బాబుగా కనిపిస్తాడని సమాచారం.
ఎంసీఏ సినిమాలో జంటగా నటించిన నాని, సాయిపల్లవి ఈ మూవీతో మరోసాని జోడీ కట్టనున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. భారీ బడ్జెట్ తో రూపొందించనున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ లోనే విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. కానీ కరోనా కారణంగా ఆలస్యం జరగొచ్చేమో.. ఇంకా ఇన్ని సినిమాలకు ఒకేసారి కమిట్ అయిన నానికి డేట్స్ సమస్య కూడా రావొచ్చేమో.. చూద్దాం ఏం జరుగుతుందో..