సారథి న్యూస్, నర్సాపూర్: అమాయకుల ప్రాణాలు బలిగొన్న నాటుసారాను ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు సోమవారం పట్టుకున్నారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం హరిచంద్ పంచాయతీకి చెందిన కొందరు గిరిజనులు విక్రయిస్తున్నారని సమాచారం తెలుసుకున్న అసిస్టెంట్ సూపర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గాయత్రి ఆదేశాల మేరకు ఎక్సైజ్ సీఐ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో 10లీటర్ల నాటుసారా, 100 కేజీల నానబెట్టిన బెల్లం, బెల్లం ఊటను పారబోశారు. నాటుసారాను అమ్మినట్లు తమ దృష్టికి తీసుకొస్తే కఠినచర్యలు తీసుకుంటామని మాట్లాడుతూ చెప్పారు. ఆయన వెంట ఎస్సై విశ్వనాథం, రాజు, హెడ్ కానిస్టేబుల్ మాణిక్ ప్రభు, చెన్నగౌడ్, కానిస్టేబుల్ సంధ్య, అనిల్ ఉన్నారు.
- June 1, 2020
- క్రైమ్
- మెదక్
- EXCISE
- NARSAPUR
- ఎన్ఫోర్స్ మెంట్
- నాటుసారా
- Comments Off on నాటుసారా పట్టివేత