సారథి న్యూస్, నాగర్ కర్నూల్: జిల్లాలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ మంగళవారం తెలిపారు. జిల్లాలోని వెల్దండ మండలం కొట్ర గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి, నాగర్ కర్నూల్ మండలం గుడిపల్లి గ్రామానికి చెందిన వ్యక్తికి, బిజినేపల్లి మండలం గంగారం గ్రామానికి చెందిన మరో వ్యక్తికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని పేర్కొన్నారు. ఆయా గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అధికారులు సూచించిన చర్యలను పాటించాలని సూచించారు. వీరు ముగ్గురు కూడా కొన్నేళ్లుగా హైదరాబాద్లోనే నివాసం ఉంటున్నారని, వీరు ముగ్గురు హైదరాబాద్ గాంధీ లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. వారికి సంబంధించిన ప్రైమరీ కాంటాక్ట్స్ ను గుర్తించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వైద్య ఆరోగ్య అధికారులు ప్రైమరీ కాంటాక్ట్ గుర్తించి వారందరినీ హోమ్ క్వారంటైన్ లో ఉంచాలని కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
- June 23, 2020
- Archive
- మహబూబ్నగర్
- లోకల్ న్యూస్
- NAGARKUROOL
- VELDANADA
- కరోనా పాజిటివ్
- నాగర్ కర్నూల్
- Comments Off on నాగర్ కర్నూల్ జిల్లాలో ముగ్గురికి కరోనా