న్యూఢిల్లీ: ఇండియా – చైనా బోర్డర్‌లో నెలకొన్న పరిస్థితులపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్రంపై విమర్శలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ మేరకు ఆదివారం ఒక న్యూస్ ఆర్టికల్‌ను ట్విట్టర్‌లో షేర్ చేసిన రాహుల్ ‘నరేంద్ర మోడీ నిజానికి సరండర్ మోడీ’ అని ట్వీట్ చేశారు. చైనా – ఇండియా మధ్య బార్డర్ ఇష్యూ జరుగుతున్న మొదటి నుంచీ రాహుల్ గాంధీ కేంద్రాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆల్ పార్టీ మీటింగ్ అయిన తర్వాత కూడా సైనికులు ఎందుకు.. ఎక్కడ చనిపోయారు? అంటూ ట్వీట్లు చేశారు. ప్రభుత్వానికి దాడి గురించి ముందే తెలిసినా స్పందించలేదని విమర్శించారు. కాగా.. రాహుల్ గాంధీకి అమిత్ షా గట్టి కౌంటర్ ఇచ్చారు. జవాన్ తండ్రి మాట్లాడిన వీడియోను పోస్ట్ చేసి బదులిచ్చారు.
- June 21, 2020
- Top News
- MODI
- RAHULGANDHI
- అమిత్ షా
- నరేంద్ర మోడీ
- రాహుల్‌గాంధీ
- Comments Off on నరేంద్ర మోడీ కాదు.. సరండర్ మోడీ