Breaking News

నయనానందకరం నల్లవాగు

నల్లవాగుకు జలకళ

నారాయణఖేడ్, సారథి న్యూస్: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్ పరిధిలోని సిర్గాపూర్ మండలంలోని నల్లవాగు ప్రాజెక్ట్​ జలకళను సంతరించుకున్నది. బుధవారం స్థానిక ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్​రెడ్డి నల్లవాగుకు పూజలు చేశారు. అనంతరం గేట్​ను ఎత్తి నీటి విడుదల చేశారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు వెంకట్ రామ్ రెడ్డి, డీసీసీబీ జిల్లా డైరెక్టర్ నరేందర్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్​ రమావత్ రాంసింగ్, ఎంపీపీ మహిపాల్ రెడ్డి, జెడ్పీటీసీ రాఘవరెడ్డి, కల్హేర్ జెడ్పీటీసీ నర్సింహా రెడ్డి, ఎంపీటీసీ ప్రమీల, సర్పంచ్ హనుమదాస్ సునీత, టీఆర్​ఎస్​ నాయకులు సంజీవరావు పాటిల్, కిషన్ రెడ్డి, వంశీ రెడ్డి, జలెందర్, రైతులు పాల్గొన్నారు.