కోలీవుడ్‌లో ఆర్ జే బాలాజీ ఓ డివోషనల్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. పేరు ‘మూకుత్తి అమ్మన్’. టైటిల్ రోల్ సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతార పోషిస్తున్నారు. ఈ చిత్రంలో నయన్ భక్తురాలిగా, అమ్మవారిగా రెండు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించనుంది. భక్తిరస ప్రధానంగా సాగే ఈ సినిమాలో నటించేందుకు తనకెంతో ఆనందంగా ఉందంటూ.. ఈ సినిమా షూటింగ్ మొదలయినప్పటినుంచీ నయన్ నాన్‌వెజ్ తినడం మానేసి చాలా నిష్టగా ఉందట. అలాగే యూనిట్ మొత్తం కూడా శాఖాహారాన్నే తీసుకున్నారట. షూటింగ్ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి కానీ లాక్ డౌన్ కారనంగా విడుదల వాయిదా పడింది. థియేటర్స్ ఓపెన్ అయిన వెంటనే ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాతో పాటు నయన్ మరో రెండు చిత్రాల్లో నటిస్తుండగా, విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో ‘కాత్తు వాక్కుల్ ఇరెండు కాదల్’ సినిమా చేస్తున్నారు.
- June 5, 2020
- సినిమా
- NAYANATHARA
- VIGNESH
- మూకుత్తి అమ్మన్
- విఘ్నేశ్ శివన్
- Comments Off on నయనతార డిఫరెంట్ రోల్