– సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
సారథి న్యూస్, గోదావరిఖని: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, వానాకాలంలో నకిలీ ఎరువులు, విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కొప్పుల ఈశ్వర్ హెచ్చరించారు. వ్యవసాయరంగ సంబంధిత అంశాలపై శనివారం ఆయన కలెక్టర్ జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఎన్టీపీసీ మిలీనియం హాలులో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. వానాకాలం పత్తి, పంట కందులను ప్రోత్సహించాలని మంత్రి సూచించారు. సన్నరకం ధాన్యం పండించే రైతులకు సంపూర్ణ అవగాహన కల్పించాలన్నారు.
జడ్పీ చైర్మన్ పుట్ట మధు మాట్లాడుతూ.. రైతులు లాభదాయక పంటలు వేయాలని, అధికారుల సూచనలు, సలహాలు పాటించాలని సూచించారు. సమావేశంలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, కలెక్టర్ సిక్తాపట్నాయక్, అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రఘువీర్ సింగ్, రామగుండం మేయర్ అనిల్ కుమార్, పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి శంకర్ కుమార్, రామగుండం మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, డీఏవో తిరుమల ప్రసాద్, జిల్లా హార్టికల్చర్ అధికారి జ్యోతి, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు రామ్ రెడ్డి, జిల్లా సహకార అధికారి చంద్రప్రకాష్ రెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి పాల్గొన్నారు.