న్యూఢిల్లీ: గతేడాది ఇంగ్లాండ్‌తో జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత్ జట్టు గందరగోళంగా ఆడిందని ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ అన్నాడు. లక్ష్యఛేదనలో సూపర్ ఫినిషర్ ధోనీలో కసి కనిపించలేదన్నాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 337/7 స్కోరు చేస్తే.. భారత్ 31 పరుగుల తేడాతో ఓడింది. ‘ఈ మ్యాచ్ మొత్తంలో ధోనీ, జాదవ్ బ్యాటింగ్ వింతగా అనిపించింది. ఈ ఇద్దరిలో ఏమాత్రం కసి కనిపించలేదు. భారీ సిక్సర్ల కొట్టాల్సిన సమయంలో సింగిల్స్ తీయడంపై దృష్టిపెట్టారు. 11 ఓవర్లలో 112 పరుగులు చేయాల్సిన దశలో మహీ క్రీజులోకి వచ్చాడు. మామూలుగా ఈ స్కోరు అతనికి పెద్ద విషయమే కాదు. ధోనీ కుదురుకుంటే మరో 12 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ ఛేజ్ చేసేవాడు. ఎందుకోగానీ అతనిలో కసి లోపించింది. కనీసం జాదవ్ బ్యాట్ ఝుళిపిస్తాడనుకుంటే అతనూ వెనకడుగు వేశాడు. గెలిచే అవకాశం ఉన్న మ్యాచ్‌లో దూకుడుగా ఆడడమే నా దృష్టిలో సరైంది. నేను ఎక్కువగా దీనినే అనుసరిస్తాను.
మ్యాచ్ ఆరంభంలో రోహిత్, విరాట్ ఆట కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. 27 ఓవర్లు క్రీజులో ఉండి 138 పరుగులే చేశారు. దీనివల్ల లోయర్ ఆర్డర్‌పై ఒత్తిడి పెరిగింది. మా బౌలింగ్ అద్భుతంగా ఉందని తెలుసు. కానీ ఈ ఇద్దరు వరల్డ్ క్లాస్ ప్లేయర్లు భారీ టార్గెట్ ఉన్నప్పుడు చాలా భిన్నంగా ఆడతారు. అలాంటిది ఈ మ్యాచ్‌లో వాళ్లిద్దరూ తేలిపోయారు’ అని ఫ్లింటాఫ్ వివరించాడు. మైదానం బౌండరీ లైన్ సైజ్‌పై కోహ్లీ చేసిన వ్యాఖ్యలను కూడా ఫ్లింటాఫ్ తప్పుబట్టాడు. ఏ బ్యాట్స్‌మెన్ కూడా ఇలాంటి చెత్త ఫిర్యాదులను చేయడని విమర్శించాడు.