సారథి న్యూస్, జగిత్యాల: జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం స్తంభంపల్లి గ్రామశివారులో బీసీ గురుకుల పాఠశాల నిర్మాణానికి ఐదెకరాలు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విజ్ఞాన భవన్ నిర్మాణానికి ఎకరా, హరిత హోటల్ నిర్మాణానికి ఐదెకరాల చొప్పున కేటాయించిన స్థలాన్ని బుధవారం రాష్ట్ర సంక్షేమ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సహకారంతో ధర్మపురి నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో తీర్చిదిద్దేందుకు పనిచేస్తున్నామని అన్నారు. 40 ఏళ్లలో లేని విధంగా అంబేద్కర్ విజ్ఞాన్ భవనం నిర్మించి వివిధ రకాల పోటీపరీక్షలకు ఉపయోగపడేలా స్టడీ మెటీరియల్స్ అందుబాటులో ఉంచుతామన్నారు.
- September 23, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- DHARMAPURI
- JAGITYALA
- KOPPULA ESWAR
- కొప్పుల ఈశ్వర్
- జగిత్యాల
- ధర్మపురి
- Comments Off on ధర్మపురి నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతాం