Breaking News

ద్రవిడే ఒప్పించాడు

ద్రవిడే ఒప్పించాడు

న్యూఢిల్లీ: ప్రపంచకప్ 2007 టీ20 జట్టుకు దూరంగా ఉండేలా సచిన్, గంగూలీని.. నాటి కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ఒప్పించాడని అప్పట్లో టీమ్ మేనేజర్​గా ఉన్న లాల్​చంద్​ రాజ్​పుత్​ తెలిపాడు. యువకులకు అవకాశం ఇవ్వడం కోసమే అలా చేశాడన్నాడు. దీనికి సచిన్, గంగూలీ పెద్ద మనసులో అంగీకరించారన్నాడు. ‘అప్పుడు ఇంగ్లండ్​తో సిరీస్​కు ద్రవిడ్ కెప్టెన్​గా ఉన్నాడు. కొంత మంది ఆటగాళ్లు అక్కడి నుంచి నేరుగా జొహనెస్​బర్గ్​ వెళ్లారు. యువ క్రికెటర్లకు అవకాశం కోసం సీనియర్లు తప్పుకోవాలని అనుకున్నారు. దీనికి ద్రవిడ్ చొరవ చూపెట్టాడు. దిగ్గజాలు అలానే ఉంటారు. కానీ ఆ ప్రపంచకప్​లో ఆడనందుకు తర్వాత వాళ్లు చాలా బాధపడ్డారు. అయితే ఓ గొప్ప టీమ్​కు అక్కడే పునాదులు వేసేందుకు వీళ్లు సచిన్, ద్రవిడ్, గంగూలీ చూపిన ధైర్యం భవిష్యత్ తరాలకు స్ఫూర్తి’ అని లాల్​చంద్​ వ్యాఖ్యానించాడు.