సారథి న్యూస్, చొప్పదండి: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా కరీంనగర్జిల్లా చొప్పదండి మండల కేంద్రంలో శనివారం కురుమ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. జనగామ జిల్లాకు దొడ్డి కొమురయ్య జిల్లా పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు కచ్చు అనిల్, కచ్చు సతీష్, ఏముండ్ల రాజు, జగన్, నిట్టూ మునేశ్, దయ్యాల సాగర్, నరేష్, రాజశేఖర్, సతీష్, బీరేశ్ పాల్గొన్నారు.
- July 4, 2020
- Top News
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- DODDI
- KOMURAYYA
- KURUMA
- చొప్పదండి
- దొడ్డి కొమురయ్య
- Comments Off on దొడ్డి కొమురయ్యకు ఘననివాళి