సారథి న్యూస్, చారకొండ: భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజగృహంపై జరిగిన దాడిని ఖండిస్తూ శనివారం నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలం చంద్రాయన్పల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బహుజన నాయకులు గడ్డమీది బాల్రాం, ఎర్ర గెల్వయ్య, శంకర్, స్వేరోస్ చారకొండ మండలం ప్రధాన కార్యదర్శి పల్లె వెంకటయ్య, డీఎస్ మాస్ చారకొండ మండల డైరెక్టర్ ఎర్ర రోశయ్య తదితర నాయకులు పాల్గొన్నారు.
- August 1, 2020
- Archive
- మహబూబ్నగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- AMBEDKAR
- CHANDRAYANAPALLY
- RAJAGHRUHA
- అంబేద్కర్
- చారకొండ
- రాజగృహ
- Comments Off on దాడికి పాల్పడిన వారిని శిక్షించాలి