Breaking News

దక్షిణాఫ్రికాలో 3టీ క్రికెట్



జొహెన్సెస్​బర్గ్​: కరోనా దెబ్బకు ఆగిపోయిన క్రికెట్​ను తిరిగి గాడిలో పెట్టేందుకు అన్ని దేశాలు తమ వంతు కృషి చేస్తున్నాయి. ఇందులో దక్షిణాఫ్రికా కాస్త భిన్నంగా ఆటను ప్రారంభించబోతున్నది. 3టీ రూపంలో ఓ భిన్నమైన ఫార్మాట్​ను అందుబాటులో తీసుకొస్తోంది. ఈనెల 27న 24 మంది ఆటగాళ్లు మూడు జట్లుగా విడిపోయి మ్యాచ్ ఆడనున్నారు. మూడు జట్లలో ఈగల్స్​కు డివిలియర్స్, కింగ్​ ఫిషర్స్​కు రబడా, కైట్స్​కు డికాక్ సారథ్యం వహించనున్నాడు. ప్రతి జట్టులో ఎనిమిది మంది ఆటగాళ్లు ఉంటారు. మొత్తం 36 ఓవర్లను రెండు దఫాలుగా బౌలింగ్ చేయాలి. రెండు ఇన్నింగ్స్​లో కలిపి ప్రతి టీమ్ 12 ఓవర్లు ఆడుతుంది. ప్రథమార్థంలో ప్రతి జట్టు ఆరు ఓవర్లు ఎదుర్కొంటుంది. బ్యాటింగ్ ఎవరు చేయాలనేది డ్రా ద్వారా నిర్ణయిస్తారు. ఏడు వికెట్లు కోల్పోయినా కూడా ఆఖరి బ్యాట్స్​మెన్ ఒక్కడే బ్యాటింగ్ చేయొచ్చు. రెండు ఇన్నింగ్స్​ల్లో అత్యధిక స్కోరు చేసిన జట్టు విజేతగా నిలుస్తుంది. తర్వాతి రెండు టీమ్​లకు రజతం, కాంస్యం లభిస్తాయి.